బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

Nitish
Nitish

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న తన పదవికి రాజీనామా చేసిన ఆయన బీజేపీ మద్దతుతో ఈ రోజు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి ప్రసాద్ విషయంలో రాజీ పడలేననీ, లాలూచీ పడలేననీ పేర్కొంటూ నితీష్ కుమార్ నిన్న సాయంత్రం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాతో బీహార్ లో మహాఘట్ బంధన్ కథ ముగిసింది. అయితే ఆయన రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే నితీష్ కు మద్దతు ఇవ్వడానికి బీజేపీ ముందుకు వచ్చింది. దీంతో రాష్ట్రంలో జేడీయూ-బీజేపీ సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.