బీరపొట్టు పచ్చడి

beerkaaya
Ruchi

బీరపొట్టు పచ్చడి

కావలసినవి

బీరపొట్టు-రెండు కప్పులు ఎండుమిర్చి-4-5 జీలకర్ర-ఒక టేబుల్‌స్పూన్‌ ధనియాలు-రెండు టేబుల్‌స్పూన్లు నువ్ఞ్వలు-మూడు టేబుల్‌స్పూన్లు మినపప్పు-రెండు టేబుల్‌స్పూన్లు శనగపప్పు-రెండు టేబుల్‌స్పూన్లు చింతపండు- పెద్దనిమ్మకాయంత ఉప్పు-తగినంత ఆవాలు, జీలకర్ర-పావ్ఞటేబుల్‌స్పూన్‌, కరివేపాకు-రెండు రెబ్బలు నూనె-నాలుగు టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం

బీరపొట్టు బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. కడాయిలో జీలకర్ర, ధనియాలు, నువ్ఞ్వలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే రెండు చెంచాలు నూనె వేడిచేసి బీరపొట్టు వేసి మగ్గనివ్వాలి. ఇందులోని నార, గింజలు తీసిన చింతపండు వేయాలి. పూర్తిగా మెత్తబడ్డాక దింపేయాలి. చల్లారిన తర్వాత ముందు వేయించుకున్న దినుసులు పొడిచేసుకుని పొట్టు, చింతపండు, తగినంత ఉప్పువేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి పచ్చడిలో కలపాలి. ఇష్టముంటే పోపులో నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు.