బీజేపీ, టీఆర్ఎస్ హింసాకాండ

uttam kumar reddy
uttam kumar reddy

Kalvakurthi: కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్  రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇటువంటి దాడులకు పాల్పడుతున్నదని  విమర్శించారు. అలాగే టీఆర్ఎస్ కూడా హింసాకాండకు దిగుతున్నదని  విమర్శించారు. తాండూరులో రోహిన్ రెడ్డిపైనా, అలాగే మధుయాష్కిపైనా కూడా టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని విమర్శించారు. ఓటింగ్ సరళి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సరళి చూస్తుంటే ప్రజాకూటమి విజయం తథ్యమనిపిస్తున్నదని, అందుకే ప్రత్యర్థులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఇటువంటి దాడులకు కాంగ్రెస్ బెదదని పేర్కొన్నారు.