బీజాపూర్‌ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మృతి

Encounter
Encounter

చత్తీస్‌గఢ్‌: దక్షిణ చత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ జిల్లాలో నేడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒకు మహిళ మావోయిస్టు కూడా ఉన్నట్లు  పోలీసులు తెలిపారు. గంగళూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జిల్లా, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసులు ఉమ్మడిగా మావోయిస్టులపూ దాడులు నిర్వహించారని పోలీసు అధికారి ఒకరు  తెలిపారు. మధువాండీ-కౌవాడేగన్‌ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. ఘటనా స్థలి నుండి ఒక రైఫిల్‌, 12 బారో పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.