బీఎస్సెన్నెల్‌ బొనాంజా ఆఫర్‌

BSNL11
BSNL

టెలికాం సంస్థల్లో ఒకటైన జియో సంచలనం… చౌక డేటా ఆఫర్లతో ఆకట్టుకుంటునంన జియోకు పోటీగా ఇప్పటికే పలు టెలికాం సంస్థలు ప్రత్యేక ఆఫర్లు తీసుకొచ్చాయి. తాజాగా ఇదే బాటలో ప్రభుత్వ రంగ బిఎస్సెన్నెల్‌ కూడా సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌లో రూ.118 ప్రారంభ ధరలో కొన్ని ఆఫర్లు ప్రకటించింది. రూ.118తో రీచార్జీ చేసకుంటే 28రోజుల పరిమితితో రోజుకు 1జిబి 4జీ డేటా వస్తుంది. దీంతో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ కూడా ఉంటాయి. ఇప్పటికే రూ.98తో జియో ఆఫర్‌ ఉన్న విషయం విదితం. దీనికి పోటీగా బిఎస్సెన్నెల్‌ రూ.118ఆఫర్‌ తీసుకొచ్చింది. ఇక దీంతో పాటు రూ.379, రూ.551తో ప్రీపెయిడ్‌ ఆఫర్లు ప్రకటించింది. రూ.379తో రీచార్జీ చేసుకుంటే రోజుకు 4జిబి 3జి/4జి డేటా 90రోజుల పాటు వస్తుంది. ఇక రూ.551తో రీచార్జీ ఆఫర్‌ కేవలం కేరళ సర్కిల్‌లో మాత్రమేనని బిఎస్సెన్నెల్‌ తెలిపింది.