బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారుల మృతిపై వివరణ కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ

NHRC
NHRC

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్‌ ‘చిన్నారుల మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమీషన్‌ స్పందించింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి నోటీసు పంపింది. మృతుల కుటుంబాలకు ఎలాంటి పునరావాస చర్యలు ఏ మేరకు చేపట్టారు? ఘటన కారకులైన వారిపై చర్యలు తీసుకున్నారా? అనే వాటిపై సమగ్ర నివేదిక కావాలని నాలుగు వారాల్లోగా సమర్పించాలని సూచించింది. బకాయిలు చెల్లింపులో జాప్యం కారణంగా ప్రాణవాయవు సరఫరా నిలిపి వేయడంతో గోరఖ్‌పూర్‌ బీఆర్డీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియాలో వచ్చిన వరుస కథనాలపై స్పందించిన కమీషన్‌ ఈ కేసును సుమోటోగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.