బిసి విద్యార్థులకు కెసిఆర్‌ దసరా కానుక

students11
Students

బిసి విద్యార్థులకు కెసిఆర్‌ దసరా కానుక

హైదరాబాద్‌: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు కెసిఆర్‌ సర్కార్‌ దసరా నజరానా ప్రకటించింది. బిసిల్లో విదేశాలకు ఉన్నత విద్యఅభ్యసించాలనుకునేవారికి ప్రభుత్వం ఆర్థికసాయం అందజేయనుంది. ఈమేరకు మహాత్మా జ్యోతిరావ్‌పూలీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని అమలుచేయాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించారు. ఏడాదికి 300 మంది చొప్పున ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు పంపిణీకిగానూ రూ.60 కోట్లు కేటాయించారు.