బిసి రెసిడెన్షియల్‌ స్కూలు ఏర్పాటు చేయండి: టిడిపి ఎమ్మెల్యే

tdp mla, suryanarayana
tdp mla, suryanarayana

అమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రెసిడెన్షియల్‌ స్కూలును ఏర్పాటు చేయాలని టిడిపి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సూర్యనారాయణ కోరారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ..గతంలో చంద్రబాబు ధర్మవరం వచ్చినపుడు బిసి రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాని ఇప్పటివరకూ నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరగలేదని తెలిపారు. ధర్మవరంలో బిసిలు అధికంగా ఉన్నారని, దగ్గరగా స్కూల్‌ లేక అనంతపురం వరకు పోయి చదువుకుంటున్నారని చెప్పారు. వీలైనంత త్వరలో బిసి రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రిని సూరి కోరారు.