బిసిసిఐ ఎన్నిక‌ల న‌గారా…

BCCI-1
BCCI

ముంబై: బీసీసీఐ ఎన్నికలకు నగారా మోగనుంది. 90 రోజుల్లో బీసీసీఐ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని క్రికెట్‌ పాలకుల కమిటీ(సీఓఏ) అధ్యక్షుడు వినోద్‌ రాయ్‌ అన్నారు. ‘‘అది మాకు మేము పెట్టుకున్న గడువు. బీసీసీఐ కొత్త సర్వసభ్య కమిటీ నియామకం కాగానే సీఓఏ బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. బీసీసీఐ వ్యవహారంలో పూర్తి పారదర్శకంగా, నిజాయతీగా వ్యవహరించేందుకు మేం ప్రయత్నించాం’’ అని వినోద్‌ రాయ్ తెలిపారు. దీంతో వచ్చే నవంబర్‌ చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడిగా సీకే ఖన్నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష రేసులో మాజీ కెప్టెన్‌ గంగూలీ పేరు బాగా వినిపిస్తోంది. గుంగూలీ ఎన్నిక ఏకగ్రీవం కానుందన్న వార్తలు కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.