బిసిల‌కు రాయితీ రుణాలు

kcr
kcr

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని బీసీలకు కానుక ప్రకటించారు. బీసీలకు రాయితీ రుణాల కోసం రూ.102.8 కోట్లు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన దస్త్రంపై శుక్రవారం సీఎం సంతకం చేశారు. ఈ రుణాల వల్ల 12,218 మంది బీసీలకు లబ్ధి చేకూరనుంది. రాయితీ రుణాల నిధుల మంజూరు పట్ల తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తంచేశారు. 12 ఫెడరేషన్స్‌ లబ్ధిదారులకు సత్వరమే రాయితీ రుణాలిస్తామని తెలిపారు.