బిర్యానీ హైదరాబాద్ కా షాన్

Hyderabad biryani

దమ్ కా బిర్యానీ భాగ్యనగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన రెసిపీ. అది అమెరికా అయినా.. బ్రిటన్ అయినా.. జర్మనీ అయినా.. జపాన్ అయినా.. సింగపూర్ అయినా.. స్విట్జర్లాండ్ అయినా.. బిర్యానీ తినాలనిపిస్తే హైదరాబాద్ వైపు చూడాల్సిందే. అంతటి ఖ్యాతి హైదరాబాద్ బిర్యానీ సొంతం. ప్రధానులు, ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, సినీతారలు ఎందరెందరినో మెప్పించిన నగర వంటకం ఇది. నగరాన్ని సందర్శించిన ఏ పర్యాటకుడూ బిర్యానీ రుచిచూడకుండా వెనుదిరగడంటే అతిశయోక్తి కాదు.