బిడ‌బ్లూఎఫ్ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌కు నాలుగో స్థానం

SRIKANTH
SRIKANTH

తాజాగా బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ ఫెడ‌రేష‌న్ విడుద‌ల చేసిన ప్ర‌పంచ ర్యాకింగ్స్‌లో కిడాంబి శ్రీకాంత్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇటీవ‌ల డెన్మార్క్ సూప‌ర్ సిరీస్ కైవ‌సం చేసుకోవ‌డంతో 66923 పాయింట్లు సాధించి నాలుగో ర్యాంక్‌కి చేరుకున్నాడు. అత‌ని కంటే ముందు స్థానాల్లో విక్ట‌ర్ అలెక్స‌న్‌, సోన్ వా హో, లిన్ డాన్‌లు ఉన్నారు. 2015లో ఒక‌సారి శ్రీకాంత్ మూడో ర్యాంక్ వ‌ర‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ కూడా గెలిస్తే శ్రీకాంత్ ర్యాంక్ మ‌రింత మెరుగుప‌డే అవ‌కాశం ఉంది. ఇత‌ర భార‌త క్రీడాకారులైన హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్‌, స‌మీర్ వ‌ర్మ‌లు వ‌రుస‌గా 12, 18 ర్యాంకుల్లో నిలిచారు. అజ‌య్ జైరాం 23వ స్థానంలో నిలిచాడు. ఇక మ‌హిళా క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ర్యాంకు ఒక స్థానం మెరుగుప‌డింది. ఆమె 12వ స్థానం నుంచి 11వ ర్యాంకుకు చేరుకుంది. పీవీ సింధు త‌న రెండో స్థానంలోనే కొన‌సాగుతోంది.