బిడియపడకుండా బయటపడండి

మగువ మనసు
                                బిడియపడకుండా బయటపడండి

lady
lady

‘ఒక ఫ్రెండ్‌గా చెబుతున్నా..పంటిబిగువ్ఞన భరించింది చాలు..ఇకనైనా బయటపడండి..మగాళ్లలోని మురికితనాన్ని ఎండగట్టండి..మీకెదురైన వేధింపుల్ని ప్రపంచం ముందు పెట్టండి అని నటి అలేసా మిలానో ట్విట్‌ చేసిన తర్వాత ‘మీ.టూ (నాకు కూడా) కాన్వాసింగ్‌ బాగా ఊపందుకుంది. లైంగిక వేధింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న హాలీవ్ఞడ్‌ ప్రొడ్యూసర్‌ హార్వే వేన్‌స్టీన్‌కు వ్యతిరేకంగా ఓపెన్‌కాల్‌ ఉద్యమం అక్టోబర్‌ 15న మొదలైంది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆకతాయిల నుంచి ఎదురైన లైంగిక వేధింపులను సవివరంగా రాసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయవచ్చు అన్నదే ఈ ఓపెన్‌ కాల్‌ ఉద్దేశం. హాలీవ్ఞడ్‌లో హార్వే వేన్‌స్టీన్‌ అనే ప్రొడ్యూసర్‌ గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చేపట్టిన సీక్రెట్‌ కథనం పెనుసంచలనాలకే తావిచ్చింది. ఎంతోకొంత స్టార్‌ హీరోయిన్లు సైతం ఇతని చేతిలో లైంగికంగా వేధించబడ్డారు అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం పెద్ద రచ్చకే దారితీసింది. ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో హార్వే బాధిత హీరోయిన్లంతా దాదాపుగా టాప్‌స్టార్‌ స్థాయిలో ఉన్నవారు. ఏంజెలానా జోలే, కేట్‌ విన్స్లేట్‌ వంటి హాలీవ్ఞడ్‌ అగ్రతారలే కాదు ఆఖరికి మన భారతీయ స్టార్‌ ఐశ్వర్యరా§్‌ుని కూడా పొందాలని ప్రయత్నించాడట సెక్స్‌ పర్యర్టో. అయితే ఈ సందర్భంగా బాధింపబడిన చాలామంది సినీ సెలబ్రిటీలు టీవీ నటీమణులు ‘మీ టూ అంటూ ట్విట్టర్లో తమ అనుభవాన్ని పంచుకున్నారు. ‘నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ కృతి కర్భందా, దీని గురించి విన్నాను అంటూ రాధికా ఆప్టే ఓపెన అయ్యారు. ఈ విషయంపై అమెరికాలోని ఓ ప్రొగ్రామ్‌లో మాట్లాడాల్సిందిగా హాలీవ్ఞడ్‌ హీరోయిన్‌గా ఎదుగుతున్న ప్రియాంకచోప్రాను అడిగితే, ‘ఇలా వేధించే పర్వం ఇండియాలో కూడా ఉంది. మీరు సినిమా ఇండస్ట్రీలోనే ఉందని అనుకోవద్దు. ఏ రంగంలో లేదో చెప్పండి? అన్ని రంగాల్లోనూ కొందరు పురుషులు మహిళలను ఇలా వేధిస్తున్నారు. అయితే వారు కేవలం సెక్స్‌ కోసం అలా చేయట్లేదు. పవర్‌ కోసం చేస్తున్నారు. ఒక అమ్మాయిని బానిస చేసుకుంటే అందులో తృప్తిచెందే మగ అహంకారం కోసం అలా చేస్తున్నారు. దీన్ని అరికట్టాలి అంటూ ప్రియాంక కామెంట్‌ చేసింది.
గ్లామర్‌ ఫీల్డ్‌ల్చో ఇటువంటి ఉదంతాలు కొత్తేమీ కాదు. వెలుగులోకి వచ్చినప్పుడు హృదయం ద్రవించేలా చేసే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతూనే ఉన్నాయి? ఎందుకు ఆగడం లేదు? సంఘటనలు, బాధతులు నాణేనికి ఓవైపు మాత్రమే. నాణేనికి ఇంకోవైపు కూడా ఉంది. ఓ ఉద్యోగంలో కొత్తగా చేరేటప్పుడు శిక్షణాకాలం ఉంటుంది. మన బాధ్యతలను ఉద్యోగంలో సక్రమంగా నిర్వర్తించడానికి ఆ కాలం చాలా బాగా ఉపకరిస్తుంది. అదేరకంగా సినిమా రంగం కూడా ఓ వృత్తి కదా! స్క్రీన్‌ మీద ముద్దులు, కౌగిలింతలు, అసభ్యకరమైన సన్నివేశాలు కొనైన్నా లేకుండా వచ్చే సినిమాలే అరుదు. అటువంటప్పుడు ఆ భావాలు స్క్రీన్‌ మీద ప్రదర్శించేముందు ఫలానా హీరోయిన్‌ ఎంతవరకు ఆ పాత్రకు నప్పుతుందో అని పరీక్షించడానికి ఓ ప్రొడ్యూసరో, డైరెక్టరో ఎవరో ఒకరు చేయి వేస్తామోననో అలా చేసామనో సమాధానం ఇస్తే.. దాన్ని ఎంతవరకు తప్పు పట్టగలర? నిజాయితీగా..నిజంగా నిజం వ్యక్తీకరించాలంటే ‘బాడీ పొలిటిక్స్‌తో నడుస్తున్న వ్యక్తి అని తెలిసినప్పటికీ ఆ రంగంలోకి ప్రవేశించేవారు తర్వాత దానిలో తప్పులు ఎంచడానికి ఎంతవరకూ అర్హులు అవ్ఞతారు? సంఘటన జరిగినప్పుడు బయటపెట్టేవారు తక్కువ.

పరిస్థితులతో సర్దుకుని ఎలాగో సెటిల్‌ అయిపోదాం అనే భావంతో సాగిపోయేవారే ఎక్కువ. మనకు నచ్చనవి, మన ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నాశనం చేసే అంశాలు ఉంటాయని పూర్తిగా తెలుసుకుని వెళ్లేవారంతా అంతా అయిపోయాక కొన్ని సంవత్సరాల వ్యవధి తర్వాత గొంతెత్తితే ప్రయోజనం ఏముంది? ఆరోజు సమస్యగా అనిపించనిది ఈ రోజు ఆ రోజు జరిగిపోయిన, సంఘటన ఎందుకు సమస్యగా పరిణమించింది? ఈ ప్రపంచంలో ఒకే అంశం అందరికీ సమస్యగా పరిణమించకపోవచ్చు. ఎందుకంటే అది వ్యక్తిగత ప్రాధాన్యతలు, అభిరుచులకు సంబంధించిన అంశం కానుక. ‘అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నది సామెత కావచ్చు. కానీ ఈ పరిస్థితికి ఇది సరిగ్గా నప్పుతుంది. ‘ఇది సహజం, ‘ఎదగడానికి ఒక మెట్టు అని అనుకుంటూ ఏదైనా అవకాశం జరిగినప్పుడు మన బాధను బయటపెడదాం అనే మనస్తత్వం ఉన్నంతకాలం ఇలాంటి ఉదంతాలకు ముగింపు అనేది ఉండదు. ఇలాంటి విషయాల్లో ‘స్త్రీ సమానత్వం, స్త్రీ సాధికారత అనే అంశాలు ఎంతమేరకు వర్తిస్తాయి? ఏ కోణంలో వర్తిస్తాయి? సినిమా రంగంలో స్త్రీ ప్రాముఖ్యత ఏమిటి? స్త్రీ నిజమైన భూమిక ఏమిటి? ఆమె పాత్ర నిజంగా నాయిక ధీరత్వానికి తగినట్టు ఉంటుందా? ఏ కోణంలోనైనా కించపరచబడుతుందా? ఈ ప్రశ్నలన్నింటికి స్పష్టమైన సమాధానాలు తెలియకుండా సమాధానాలు రాబట్టకుండా..ఏ సమానత్వం గురించి ప్రశ్నిస్తాం? లైంగిక వేధింపులు ఎందుకు ఎదురవ్ఞతాయి? ఓ వ్యక్తిలో సమానపాత్ర పోషించలేకపోవడం వల్లా? అవసరానికి కచ్చితంగా చేసి తీరతారు అనే పైశాచిక ధోరణి ఆ సినీపెద్దల్లో ఎందుకు అలవడుతుంది? వెనుక దాగి ఉన్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు స్పష్టం కాకుండా ఉవ్వెత్తున విరుచుకుపడటం పరిష్కారాన్ని చూపదు.

kareena
kareena

‘స్త్రీ పాత్రను మసాలా మార్కెట్‌కి దిగజార్చిన వ్యవస్థను రూపుమాపకుండా ఇలా తాత్కాలిక ఉపశమన చర్యలు ఎన్ని చేపట్టినా ఒరిగేదేముంది? అడగాల్సింది లైంగిక వేధింపుల గురించి మాత్రమే కాదు. స్త్రీ పాత్రను దీనంగా చిత్రీకరిస్తున్న దారుణ పరిస్థితులను కూడా. ప్రతి వృత్తిలో కొన్ని నిబంధనలు, పరిస్థితులు ఉంటాయి. వాటికి ప్రామాణికాలు ఉంటాయి. అవకాశాల కోసం కొంత అతిక్రమించి, అవి అందనపుడు ఉద్యమించడం చివరికి ద్వంద్వ ప్రవృత్తిలోనే మిగిలిపోతుంది. ఇష్టం, మనసు ప్రాధాన్యతలు, విలువలు, వ్యక్తిగత అంశాలే అయినా అవి వ్యవస్థలో మార్పును తీసుకువచ్చేవిగా పరిణమించినప్పుడు సమగ్రచిత్రంగా అంశాన్ని చూసిన తర్వాతే అభిప్రాయభేదాలకు రావడం మంచిది. ‘మొక్కై వంగనిది.. అన్న రీతిలో సమస్య మొదలైనప్పుడు స్పందించకపోతే ముదిరాక పరిష్కరించేలోపు ఇంకోవైపు సమస్య పునరావృతం అవ్ఞతుంది. ‘మాకు కూడా నాయకుడిలా ధీరధాత్తను ప్రదర్శించే పాత్రలు కావాలి అని అడగడం నిజమైన సమానత్వం అవ్ఞతుంది కానీ అశ్లీలతను స్క్రీన్‌ మీద ప్రదర్శిస్తూ, దానిలో మునిగిపోతూ..దానిపై ఉద్యమించిన దానికి నిజమైన బలం ఉండదు.రియల్‌ లైఫ్‌, రీల్‌లైఫ్‌ ఒకటి కాకపోవచ్చు. కానీ ఆ పాత్రల ప్రభావం పాత్రధారులపై ఉన్నా లేకపోయినా ప్రేక్షకుల మనసుపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది అనేది మాత్రం నిజం.

పాత్రల ఔచిత్యంలో జాగ్రత్తలు లోపించడం కూడా ఈ వింత ధోరణులకు ఓ కారణం అయి ఉండవచ్చు. ఓ సమస్య ఉద్భవించింది అంటే కచ్చితంగా దాని మూలాలు సమస్య పుట్టిన వ్యవస్థ భావజాలాలలో ఎక్కడో ఓ మూల ఉంటాయి. ఆ భావజాల సారూప్యాన్ని నిర్మాణాత్మకంగా మార్చుకోగలిగితేనే నిజమైన పరిష్కారం దొరుకుతుంది. రంగస్థలం నుండి సిల్వర్‌ స్క్రీన్‌కి పరిణామం చెందిన క్రమంలో వచ్చిన మార్పులు ఆహ్వానించదగినవి. కానీ ఆ క్రమంలో ‘పాత్రచిత్రణలో చోటు చేసుకున్న మార్పులు అనుహ్యంగా సినీజగత్తు రూపురేఖలు మార్చేస్తాయి. ఆ రూపురేఖల మార్పు రంగుల లోకాన్నే మార్చేసింది. ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న గొంతులు ఇప్పుడు వాస్తవాల్ని పకలడం ప్రశంసనీయమే. కానీ ఈ చర్యలు ఎటువంటి నిజమైన, ప్రభావితమైన మార్పులు తీసుకువచ్చాయి? లేకపోతే ఈ అంశం ఎన్ని రోజులకు పాతపడిపోతుంది? ‘ఆచరణాత్మక మార్పుతో సాగే స్వరాలు మరిన్ని వెలుగులోకి రావాలని ఆశిద్దాం!
– శృంగవరపు రచన