బిజెపి సిద్ధాంతాలను ధిక్కరించినందుకే సస్పెండ్‌

Sujana Chowdary
Sujana Chowdary

న్యూఢిల్లీ: లోక్‌సభలో టిడిపి ఎంపిలు ఏపి న్యాయం చేయలని పోరాటం చేస్తుంటే ఇన్ని రోజుల నుండి సప్పెండ్‌ చేయకుండా ఈరోజే ఎందుకు సస్పెండ్‌ చేశారని టిడిపి ఎంపి సుజనా చౌదరి ప్రశ్నించారు. సస్పెండ్‌కు గురయిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి వాళ సిద్దాంతాలను ధిక్కరించి ముందుకు వెళ్తే సభలో మాట్లాడకుండా చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి నిధులు అడగడానికి తమకు హక్కు లేదా? అని నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉంటే ఈరోజు ఏపీకి జరిగిన విధంగానే రేపు అన్ని రాష్టాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మోదీ నియంతృత్వానికి, ఆ పార్టీ నేతలు వ్యవరిస్తున్న తీరుకు నిదర్శనమని సుజనా చౌదరి పేర్కొన్నారు.