బిజెపి ముందస్తు ఎన్నికలకు తొందర

Lokesh
Lokesh

అమరావతి: ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి చావుదెబ్బ తగిలినందుకే ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు తొందరపడుతుందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ప్రధాని మోదీకున్న జనాదరణను చూసే జమిలి ఎన్నికలకు భయపడుతున్నారంటూ బిజెపి నేత రాంమాధవ్‌ చేసిన ట్వీట్‌పై లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ విధంగా స్పందించారు. ఒకవేళ మోదీకి నిజంగానే జనాదరణ ఉంటే కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీని ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీకి చావుదెబ్బ తగిలిందని విమర్శించారు. అందుకే ఇప్పుడు ముందస్తు ఎన్నికలంటూ తొందర పడుతున్నారని లోకేష్‌ అన్నారు.