బిజెపి బలోపేతం కోసం బస్సు యాత్ర: లక్ష్మణ్‌

K. Laxman
K. Laxman

హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్రంలో వచ్చే నెలలో బస్సు యాత్ర చేపడుతున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ,పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని లక్ష్మణ్‌ చెప్పారు.