బిజెపి పత‌నానికి ఇది నాందిః మ‌మ‌తా

West Bengal CM Mamata benarjee
West Bengal CM Mamata benarjee

కోల్‌క‌త్తాః యూపీ, బీహార్ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. బీజేపీ పతనానికి ఇది ఆరంభమని అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్, మాయవతి, లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆమె అభినందనలు తెలిపారు. కాగా, యూపీ, బీహార్ లో జరిగిన లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఉపఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. సీఎం యోగి ఆదిత్యానాథ్ కంచుకోటైన గోరఖ్ పూర్ లో, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతనిధ్యం వహించిన ఫుల్ పూర్ లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ లోని అరారియా లోక్ సభ స్థానంలో, జెహానాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ విజయం సాధించింది.