బిజెపి నేతల పై ఆరోపణలు చేస్తున్న యనమల

Yanamala Ramakrushnudu
Yanamala Ramakrushnudu

అమరావతి: బిజెపి నేతల పై ఏపి ఆర్ధిక మంత్రి యనమల రామకృషుడు మండిపడ్డారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు బిజెపి నేతలు చెప్పాడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం సక్రమంగా సహకరిస్తే ఏపికి ఈపరిస్థితి ఎందుకు వస్తుంది. అని ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే బిజెపి అసత్య ఆరోపణలు చేస్తుందని ఆయన అన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.40వేల కోట్లు కావాలని డీపీఆర్‌ ఇస్తే కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని యనమల ఆరోపించారు.