బిజెపి తరఫున గాలి జనార్దనరెడ్డి పోటీ?

GALI JANARDHAN REDDY
GALI JANARDHAN REDDY

బెంగుళూరు: కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైనింగ్‌ కేసులో నిందితుడు, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. బిజెపి తరఫున ఆయన బరిలోకి దిగుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గాలి జనార్థన రెడ్డి బిజెపి తరఫున పోటీ చేస్తారనే విషయమై పార్టీ నుంచి అధికారుక ప్రకటన వెలువడలేదు. బిజెపి టికెట్‌పై అన్నయ్య జనార్ధన్‌ రెడ్డి పోటీ చేస్తారని ఆయన తమ్ముడు సోమశేఖర్‌ రెడ్డి చెప్పినట్లు మీడియా కధనాలు. ఈ నేపథ్యంలో జనార్ధ్దన్‌రెడ్డి
సోదరుడు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.