బిజెపి, టిడిపి వర్గాల మధ్య ఘాటు వ్యాఖ్యలు

PURANDESWARI, DEVINENI
PURANDESWARI, DEVINENI

విజయవాడ: పోలవరంపై టిడిపి, బిజెపి మధ్య మాటల యుద్దం జరుగుతున్నది. బిజెపి నేత పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఏపి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ద్వారా ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుందని, ఏపికి మోది ఇచ్చిన వరమని అన్నారు. దీనిపై దేవినేని స్పందిస్తూ దేశంలోని ఏ రాష్ట్ర సియం ఈ విధంగా ప్రాజెక్టుపై సమీక్షా సమావేశాలు నిర్వహించలేదని ఆయన అన్నారు. పార్టీలు మారే వారు మమ్మల్ని విమర్శించడం ఏంటని ఎద్దేవా చేశారు. గతంలో సోనియాగాంధీ వరం అన్న వాళ్లే ప్రస్తుతం మోది వరమని చెబుతున్నారని మంత్రి దేవినేని అన్నారు.