బిజెపి, కాంగ్రెస్‌లతో దోస్తి నై

DEVE GOWDA
DEVE GOWDA

బెంగుళూరు: ఎట్టి పరిస్థితులలోనూ బిజెపితో జత కట్టేదిలేదని, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి తెలత్తబోదని జనతాదళ్‌ అధినేత , మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు. బిజెపి పాలనలో కర్ణాటక ఎంతో నష్టపోయింది. ఈ ఐదేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. బిజెపి హయాంలో కర్ణాటకలో జైలు కెళ్లిన నేతల జాబితా తక్కువేం లేదు? అని దేవెగౌడ అన్నారు. బిజెపికి గాని ,కాంగ్రెస్‌కు గాని అధికారంలోకి రావడానికి సాయం అందించట్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు దేవెగౌడ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎవరు మెరుగైన పాలన చేస్తారో నిర్ణయించుకోవల్సింది ప్రజలే అని అన్నారు.