బిజెపి ఏపిని విస్మ‌రిస్తోందిః ఎమ్మెల్యే మోదుగుల‌

Modugula Venugopal reddy
Modugula Venugopal reddy

గుంటూరు: ఏపీని విస్మరించి బీజేపీ క్షమించరాని తప్పు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన బడ్జెట్‌పై స్పందించారు. బడ్జెట్‌లో మార్పులు చేసి ఏపీకి కేటాయింపులు పెంచాలని ఆయన మోదుగుల డిమాండ్ చేశారు ఈ సమయంలో ఎంపీగా లేనందుకు చాలా బాధగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్ర విభజన చేసి అన్యాయం చేస్తే.. బీజేపీ మాత్రం తలుపులు తెరిచే అన్యాయం చేసిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలని మోదుగుల కేంద్రానికి సూచించారు. కాగా రెండ్రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై తెలుగు రాష్ట్రాల నేతలు బడ్జెట్‌ విషయంలో దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే.