బిజెపి ఎమ్మెల్సీపై టిడిపి ఎమ్మెల్సీ ఫైర్‌

Buddha Venkanna
Buddha Venkanna

అమ‌రావ‌తిః బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. శనివారం అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ… బీజేపీ అంటే బ్రేక్ జనతా ప్రామిసెస్‌ అన్నారు. సోము వీర్రాజు మా వల్ల గెలిచి మాపార్టీ పైనే విషం చిమ్ముతున్నారని, మా వల్ల గెలిచిన ఎమ్మెల్సీ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారని వెంకన్న అన్నారు. పట్టిసీమ మోడల్‌ను దేశమంతా అధ్యయనం చేస్తోందని, కాంట్రాక్టర్లను సోము వీర్రాజు బెదిరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. లోక్‌సభకు సోము వీర్రాజు పోటీచేస్తే 10లక్షల ఓట్లలో 7250 ఓట్లు వచ్చాయని అది గుర్తుంచుకోవాలని బుద్దా వెంకన్న అన్నారు.