బిజెపి ఇలాకాలో ఇంధన ధరల బాదుడు

 

bjpFFf
BJP

న్యూఢిల్లీ: బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చిన నాటి నుంచి పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయే, తప్ప తగ్గడం లేదు. పెట్రో ధరలు నేడు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. లీటర్‌ డీజిల్‌ ధర రూ.63.20 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. దీంతో ఎక్సైజ్‌ సుంకంలో కోత విధించాలని చమురు మంత్రిత్వ శాఖ కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రోజువారి ప్రకటించే ఇంధన ధరల జాబితా ప్రకారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.72.38గా ఉంది. 2014 మార్చి నుంచి పరిశీలిస్తే ఇది అత్యధికం. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఇంధన ధరలు లీటరుకు రూ.3.31 చోప్పున పెరిగాయి. ముంబాయిలో వీటి ధరలు రూ.80వరకు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక ధరలు ఇక్కడే కొనసాగుతున్నాయి.