బిజెపి ఆదాయం రూ. 1,027 కోట్లు

bjp
bjp

న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరానికి గాను బిజెపి రూ .1027.34 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. కాగా..ఇందులో నుంచి 74 శాతం అంటే రూ. 758 కోట్లు ఖర్చు చేసినట్లు బిజెపి తెలిపింది. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను పార్టీలు సమర్పించిన ఆడిట్‌ రిపోర్టులు ఆధారంగా రాజకీయ పార్టీల ఆదాయ , వ్యయాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్‌ ్స తాజాగా నివేదిక రూపొందించింది. గత ఏడాదితో పోలిస్తే బిజెపి ఆదాయం స్వల్పంగా తగ్గింది. ఎన్సిపి పార్టీకి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం గమనార్హం. వార్షిక ఆడిట్‌లకు తుది గడువు అక్టొబరు 30 . గడువు తీరినప్పటికి కాంగ్రెస్‌ తమ ఆడిట్‌ నివేదికను సమర్పించకపోవడం గమనార్హం.