బిజెపి అధికార ప్రతినిధి రాజీనామా

bjp
bjp

హైదరాబాద్: యూసు్‌ఫగూడకు చెందిన బిజెపి నగర అధికార ప్రతినిధి కొలన్‌ సత్యనారాయణ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి కోసం తాను ఎంతో శ్రమించానని, పార్టీని ముందుకు తీసుకుపోవడంలో ఎక్కడా తాను నిర్లక్ష్యం వహించలేదని తెలిపారు. పార్టీ అధిష్టానం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు తనను బాధించిందని, దీని కోసం బిజెపి కి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.