బిజెపి అంటే బ్రోకర్స్‌ ఆఫ్‌ జగన్‌ అండ్‌ పవన్‌

Ap Depty CM KE Krishna Murthy
Ap Depty CM KE Krishna Murthy

కర్నూలు: వచ్చే ఎన్నికల్లో గెలవాలనే తపనతో జగన్‌ ప్రజలకు హామీలు ఇస్తున్నాడు. జగన్‌ ఇచ్చే హామీలు అమలు చేయాలంటే కేంద్ర బడ్జెట్‌ కూడా సరిపోదని డిప్యూటి సియం కేఈ కృష్టమూర్తి ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సియం చంద్రబాబు ఏపిని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాజన్న రాజ్యం అంటే అధికారులను జైలుకు పంపడమా? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా పవన్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిజెపి అంటే బ్రోకర్స్‌ ఆఫ్‌ జగన్‌ అండ్‌ పవన్‌ అని కేఈ అన్నారు.