బిజెపిలో ‘హోదా’ చిచ్చు!

BJPFFF
BJP

బిజెపిలో ‘హోదా’ చిచ్చు!

టిడిపి, వైఎస్‌ఆర్‌సి పోటాపోటీ రాజకీయాలతో ఎన్డీఎకే ఎదురు దెబ్బ
పై చేయి కోసం ఆ పార్టీల ఎత్తుగడలతో కొత్త సమస్య
తెలుగు రాష్ట్రాల డిమాండ్లు హోదా, రిజర్వేషన్ల పెంపుదల
ఈ రెంటిని ఆమోదించని ప్రధాని మోడీ

కోనేటి రంగయ్య / హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా అదనం గా నిధులు లభించి, మరింత అభివృద్ధి సాధ్యమనే అంశంపై ఆ రాష్ట్రానికి చెందిన కీలక పార్టీల మధ్య పెరిగిన పోటాపోటీ రాజకీ యాలు భారతీయ జనతా పార్టీలో సంక్షోభం స్థాయికి సమస్య పెరిగిందనే విశ్లేషణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో పెద్దగా ఏ సమస్య లేకుండా ప్రధాని మోడి పాలన సాగుతున్నదనే ఆత్మ విశ్వాసంతో జాతీయ స్థాయిలో ఎదరులేదనే విధంగా ఉన్న బిజెపి కి ఎపి రాజకీయాలు ఎన్డీఎ కే ఎదురు దెబ్బలా పరిస్థితి మారినట్ల యింది. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల లో బిజెపి ఓటమి కంటే కూడా ఎపి ప్రత్యేక హోదా అధిక చిచ్చు రేపుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వరుసగా పలు రాష్ట్రాల్లో పాగా వేసుకుంటూ బిజెపి అప్రతిహతంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ హోదా సమస్య పార్లమెంట్‌లో ప్రప్రథమంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం రావడానికి ఆస్కారం ఏర్పడింది. పైగా ఎన్డీ ఎలో చీలికలు వచ్చి, ప్రతిపక్షాలు అంతో ఇంతో బలపడటానికి లేదా విపక్షాల నేతలు ఒక్కటి కావడానికి అవకాశం రావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఎపి ప్రత్యేక హోదా అంశం కూడా దోహదపడినట్లు అయింది.

మారిన రాజకీయ పరిణామాల నేప థ్యంలో మరోసారి ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలతో మోడి, అమిత్‌ షా సమావేశమై తాజా పరిస్థితని సమీక్షించుకోవాల్సిన ఉంటుంది, మిగిలిన భాగస్వాములనైనా పొగొట్టుకోకుండా లేదా ఈ పక్షాలు ప్రతిపక్షాలతో జతకట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప 2018 లో జరిగే సాధారణ ఎన్నికల్లో విజమం అంత సులువుకాదని ప్రచారం జరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన డిమాం డ్లను ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించే స్థితిలోప్రధాని నరేంద్ర మోడి లేరు. దీంతో ఇటీవలి కాలంలోప్రతి రోజు ఎపి, తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ఇవే అంశాలను ప్రస్తావిస్తూ నినాదాలు కొనసాగిస్తున్నారు.

దీంతో ఏ ఒక్క రోజు కూడా అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభ సజావుగా సాగని పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ వరకు కడుపులో చల్ల కదలకుండా ఉన్న పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు రావడం వెనుక బిజెపి తప్పిదాలు ఏమిటనే చర్చ కూడా ముందుకు వస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో తాను ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతున్నది. కాగా ఎన్డీఎ భాగస్వామ్య పార్టీల్లో వరుసగా అసంతృప్తి పెరగడానికి కారణాలు ఏమిటి? మిత్రుడుగా ఉన్న చంద్రబాబును దూరం కావాలని బిజెపి దూరం చేసుకుందా? లేక పరిస్థితులు ఇందుకు దారితీసా యా? ఇందులో ఎవరి పాత్ర ఏమిటి? ఎవరు ఎవరిని విశ్వసించక పోవడం వల్ల ఇలా జరిగింది? మోడి- చంద్రబాబు మైత్రి భంగం కావడానికి కారణాలే ఏమిటి? కారకులు ఎవరనే విషయం వెల్లడికావాల్సి ఉంది.

అయితే బిజెపి నుంచి లేదా కేంద్రప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించకపోవడతో తప్పనిసరి పరస్థితు ల్లోనే తాను తాజా గా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు పదేపదే వెల్లడించారు. కేంద్ర మంత్రివర్గం నుంచి ముందుగా వైదొలిగిన టిడిపి తర్వాత ఎన్డీఎ నుంచి తప్పుకొని చివరికి నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వా మిగా ఉన్న ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం === ఫ్రంట్‌ సమీక’రణం కోసంకెసిఆర్‌ అడుగులు ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌, మార్చి17: దేశంలో కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయ సమీకరణ జరగాలని కోరుకుంటున్న టిఆర్‌ ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడుగులు వేస్తున్నారు. మేరకు సోమవారంనాడు తృణ మూల్‌ కాం గ్రెస్‌ అధినేత్రి,పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమం త్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యేందుకు కల కత్తాకు వెడుతున్నారు. ప్రత్యామ్నాయ రాజ కీయశక్తుల సమీకరణ కోసం తొలి పర్యటన చేస్తున్నారు. ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరి గే టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో దేశంలోని బిజెపి,కాంగ్రేసేతర వివిధ జాతీయ స్థాయి పార్టీల నేతలను, ఆయా పార్టీల ముఖ్యమం త్రులను ఆహ్వానించనున్నారు.అదే రోజు మూడో ఫ్రంట్‌కు అంకుర్పారణ జరగవచ్చని తెలుస్తోంది.

అయితే మూడో ఫ్రంట్‌ దశా, దిశపై మమతా బెనర్జీతో కెసిఆర్‌ చర్చించ నున్నారు. దేశంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ అవసరం ఉందని కెసిఆర్‌ ఇటీవల ప్రకటించిన మరుసటి రోజే మమతా బెనర్జీ కెసిఆర్‌కు ఫోన్‌ చేసి అభినందించారని, ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం యత్నాలు చేయాలని, తాను వెంట ఉంటానని చెప్పారని కెసిఆర్‌ తన ప్రసంగంలో చెప్పా రు. అసలు కెసిఆర్‌కు మమతా బెనర్జీ ఫోన్‌ చేయలేదని,ఆయనే ఫోన్‌ చేసి ఏదో ఏదో చెబుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేశారు. ఈ విమర్శలను పఠాపంచలు చేస్తూ కెసిఆర్‌ స్వయంగా కలకత్తాకు వెళ్లి మమతా బెనర్జీని కలువనున్నారు.

మూడో ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించనున్నారు. కాగా, పార్లమెంట్‌లో ఎన్డీయే సర్కార్‌పై టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్ద తుగా కాంగ్రెస్‌తో పాటు బిజెపియేతర పార్టీలు నిలుస్తున్నాయి.ఈ క్రమంలో టిఆర్‌ ఎస్‌ మద్దతును టిడిపి కోరింది కూడా. టిఆర్‌ఎస్‌ మాత్రం తటస్థంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. అవిశ్వాసానికి అను కూలంగాగానీ, వ్యతిరేకంగాగానీ ఓటు వేయకుండా పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సిఎం కెసిఆర్‌ కూడా కేంద్ర సరార్‌పై ఆవిశ్వాసం తీర్మానం వృధా ప్రయాస అని, చిల్లర రాజకీయం అని ఇటీవల వ్యాఖ్యానించారు కూడా. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వంగానీ, ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు ఇస్తామని టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు.