‘బిజెపిలో అత్యంత నిజాయితీపరుడు ఈయనే’

బిజెపి నేత బక్షిత్‌ సింగ్‌ విర్క్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Bakshish Singh -Rahul Gandhi
Bakshish Singh -Rahul Gandhi

న్యూఢిల్లీ: ప్రజలు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవాలనుకుంటే తాము తెలుసుకోగలమంటూ బిజెపి నేత బక్షిత్‌ సింగ్‌ విర్క్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘బిజెపిలో అత్యంత నిజాయితీపరుడు ఈయనే’ అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన నిజాయతీగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారనేలా ఎద్దేవా చేశారు.

కాగా, హర్యానాలోని అసంధ్‌ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో బిజెపి అభ్యర్థి బక్షిత్‌ సింగ్‌ విర్క్‌ మాట్లాడుతూ… ప్రజలు ఎవరు ఓటు వేసేందుకు వెళ్లినా తమకు తెలుస్తుందని అన్నారు. అలాగే, వారు ఎవరికి ఓటేశారో తెలుసుకోవాలనుకుంటే తాము తెలుసుకోగలమని, ఎందుకంటే ప్రధాని మోదీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ చాలా తెలివైన వారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా బిజెపికే ఓటు పడుతుందని అన్నారు. దీంతో ఇప్పటికే ఆయన ఈసీ నుంచి నోటీసులు అందుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/