బిజెపిలోకి ఆహ్వానించిన అమిత్‌షా: పవన్‌

PAWAN
PAWAN

ఒంగోలు: జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తనను అడిగారని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులోనూ విలీనం చేయనని తేల్చి చెప్పానని ఆయన తెలిపారు. ఇవాళ పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. బిజెపిలోకి వెళ్లే ఉద్ధేశ్యం ఉంటే అసలు పార్టీని ఎందుకు స్థాపిస్తా? ను అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అవకాశవాద‌ రాజకీయాలకు నేను ఎప్పటికీ వ్యతిరేకమని.. కార్యకర్తలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకోనని పవన్‌ అన్నారు. ఎన్నికల్లో నేను ఓడిపోవచ్చు కాని దెబ్బ కొట్టే వెళ్తానని, జాతీయ పార్టీలు బాగా పనిచేస్తే ప్రాంతీయ పార్టీలు పుట్టవన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్‌ గుర్తు చేసుకున్నారు.