బిజెపియేతర ‘సీఎం’లతో సీఎం చంద్రబాబు

అమరావతి: నేడు టిడిపి ఎంపీలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు నాయుడు 17న జరగనున్న నీతి అయోగ్ సమావేశంపై చర్చించారు. ఈ సందర్భంగా తమ ఎంపీలతో మాట్లాడుతూ పాలక బిజెపియేతర సీఎంతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా, కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో మాట్లాడినట్లు చెప్పారు. నీతి అయోగ్ సమావేశంలో ఏ ఏ అంశాలపై చర్చించాలనే అంశంపై చంద్రబాబు వివరించారు. ఆ సమావేశానికి వెళ్లి ఎవరి వాదన వారు వినిపించాలని, తదనంతరం సమావేశాన్ని బా§్ుకాట్ చేసే అంశంపైనా చర్చించినట్లు వెల్లడించారు. మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.