బిజెపిని వీడిన మాజీమంత్రి సీతాదేవి

Yerneni Sitadevi
Yerneni Sitadevi

విజయవాడ: కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి యర్నేని సీతాదేవి బిజెపి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె రాజీనామా లేఖను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపినట్లు సీతాదేవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వకుండా బిజెపి మోసం చేసిందంటూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు పార్టీల ఆందోళనలు పెల్లుబికన నేపథ్యంలో యర్నేని రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఆమె గతంలో టిడిపి హయంతో మంత్రిగా పని చేశారు.