బిజెపిని భూతంలా చూపిస్తే ఊరుకునేది లేదు: కన్నా

KANNA
KANNA

బిజెపిని భూతంలా చూపిస్తే ఊరుకునేది లేదు: కన్నా

విజయనగరం: µ: భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో భూతంలా చూపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని అలాచేస్తే ఊరుకునేం దుకు సిద్ధంగా లేమని భారతీయ జనతాపార్టీ ఎ.పి చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరి గిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్ర బాబు నాలుగేళ్లలో ఎంతో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

ఇకపై చంద్రబాబు నాటకాలు జరగవని రాష్ట్రంలో టిడ ిపి, వైఎస్సీర్సీ అలెయన్స్‌ నడుపుతుందన్నారు. వైసిపికి, జనసేనకి ఓట్లువేస్తే బిజెపికి వేసినట్లే నని ప్రజలను టిడిపి తప్పుదోవ పట్టిస్తుందన్నా రు. రాష్ట్రంలో కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తున్నాయని ఎపికి వస్తున్న అధిక నిధులు చూసే చంద్రబాబు కొడుకుని గ్రామీణాభివృద్ధి మంత్రిగా చేశారని ఆయన ఆరోపించారు. ప్రపం చంలోనే నేనే నీతిమంతుడ్నినని చంద్రబాబు మాట్లాడటం హస్యస్పదంగా ఉందన్నారు. కేం ద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి 2019 ఎన్ని కల్లో ప్రజలముందుకెళతామన్నారు.

ప్రత్యేక ప్యాకేజికోసం చంద్రబాబు ఐదు వేల కోట్లు అడిగితే కేంద్రం 16,500 కోట్లు ఇస్తే అప్పుడు పొగడరన్నారు. 30శాతం మొబైలేజేషన్‌ అ డ్వాన్స్‌ ఇవ్వాలని అడిగితే కేంద్రం దానిని కాద నడంతో మోడీపై చంద్రబాబు విమర్శలు చేయ డం మొదలెట్టారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి 16,500 కోట్లు వదలుకున్నా రన్నారు. ఎ.పికి కేంద్రం ఇంతవరకు ఒక లక్షా 55వేల కోట్లు రూపాయలు ఇచ్చిందన్నారు. పక్క నే ఉన్న కర్ణాటకకు కేవలం 75 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇక్క డ అబద్దాలు జరుగుతుందని అలాంటి వాటిని ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు అభద్రతా భావం పెరిగిపోయిందని కన్నా తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబు అపరిచితుడిగా మారిపోయారని ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. కేవలం దోచుకోవడానికి వ్యాపారాలు చేసుకునేందుకు అవినీతికి కేంద్రం నిధులు ఇవ్వా లని ప్రశ్నించారు. జిల్లాలో ప్రాజెక్టులు నాలు గళ్లలో ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నిం చారు.