బిజెపిని అందరూ వ్యతిరేకిస్తున్నారు

MAYAVATI
MAYAVATI

బిజెపిని అందరూ వ్యతిరేకిస్తున్నారు

లక్నో: గోసంరక్షణ పేరుతో బిజెపి కార్యకర్తలు మూక హింసకు పాల్పడుతన్నారని దేశంలో ఎస్‌టి ఎస్‌సిలను హింస పెడుతున్నారని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిజెపి పాలన సాగుతోందని అందుకే దేశంలో అందరూ బిజెపిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దేశాన్ని కాషాయమయం చేసేందుకు బిజెపి రాజకీయంగా కుట్రలు పలన్నుతోందని వాజ్‌పేయి శిష్యులని చెప్పుకుంటున్న వారిలో ఆయన కున్న విలువలు నిబద్ధత మచ్చుకైనా కనపడటం లేదని అన్నారు. రూపాయి విలువ దిగజారటం, నత్యావసర వస్తువ్ఞల ధరలు పెరగటం, పెట్రోలు ధరలు అదుపు లేకపోవటం వల్ల దేశ ఆర్థికవ్యవస్థ అల్లకల్లోలమయిందని విమర్శించారు. రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అందరూ బిజెపిని వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
====