బిజెపితో జ‌ట్టు క‌ట్టేదేలేదుః త‌మిళ‌నాడు సియం

palani swami
palani swami

న్యూఢిల్లీః భారతీయ జనతా పార్టీతో పొత్తు కానీ, మద్దతివ్వడం కానీ చేయమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళ‌నిస్వామి బుధవారంనాడు అన్నారు. అసెంబ్లీలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. కావేరీ మేనేజిమెంట్ బోర్డ్ ఏర్పాటు విషయంలో కేంద్రంపై అన్నాడీఎంకే మెతకవైఖరి చూపుతోందని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం ఈ వివరణ ఇచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కానీ, మద్దతివ్వడం కానీ జరగదని తెలిపారు.