బిజెపికి హైదరాబాద్లో ఐదు స్థానాలు కూడా దక్కవు

హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్లో పోటీ చేయాలని కోరుతున్నామని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసి ట్వీట్ చేశారు. అమిత్ షా హైదరాబాద్లో పోటీ చేసినా ఎంఐఎందే విజయమని ఓవైసి స్పష్టం చేశారు. ఇప్పుడున్న ఐదు స్థానాలను కూడా బిజెపి మళ్లీ దక్కించుకోలేదని పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు, ఉద్యోగ కల్పనపై ప్రజలకు బిజెపి ఏం చెబుతుందని ఓవైసి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.