బిజెపికి ఎక్కువ విరాళాలు

BJP
BJP

న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలన్ని అందుకున్న విరాళాల్లో బిజెపి పార్టీకే 93 శాతం విరళాలు వచ్చాయి. జాతీయ పార్టీలన్ని కలిపి మొత్తం రూ.469.89కోట్లు విరాళాలుగా అందుకున్నాయి. అయితే అందులో ఒక్క బిజెపికే రూ.437.04 కోట్లు విచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. ఎన్నికల కమిషన్‌కు జాతీయ పార్టీలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏడీఆర్‌ ఈ నివేదికను విడుదల చేసింది. రూ.20వేలకు పైగా విరాళాలు అందుకున్న జాతీయ పార్టీల వివరాలను ఈ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి రూ.26.658కోట్లు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.2.087కోట్లు, సీపీఐ(ఎం) రూ.2.756కోట్లు, సీపీఐ రూ..1.146కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.20 లక్షలు విరాళాలుగా అందుకున్నాయి.