బిజినెస్ ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ జాబితాలో భారతీయ అమెరికన్‌

shantanu narayen
shantanu narayen

ఈ ఏడాది ఫార్చ్యూన్‌ మేగజైన్‌ ప్రకటించిన బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ జాబితాలో భారతీయ అమెరికన్‌ శంతను నారాయణ్‌ 12వ స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో జన్మించిన నారాయణ్‌ ప్రస్తుతం అమెరికాకు చెందిన కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ
అడోబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 56 ఏళ్ల వయసున్న నారాయణ్‌ అడోబ్‌ వృద్ధిలో కీలక పాత్ర పోషించినట్లు ఫార్చ్యూన్‌ పేర్కొంది. 2007 నవంబరు నుండి అడోబ్‌ సీఈవోగా నారాయణ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్‌ అమెరికాలో ఇన్నేళ్లపాటు కీలక పదవిలో కొనసాగడం చాలా అరుదు.