బిజినెస్‌ సూచీలో భారత్‌కు 77 వర్యాంకు

INDIA
INDIA

న్యూఢిల్లీ: బిజినెస్‌ సానుకూల వాతవరణం మెండుగా ఉన్న దేశాల్లో భారత్‌ 23స్థానాలను అధిగమించి 77వ ర్యాంకును సాధించింది. ప్రపంచ బ్యాంకు రూపొందించిన బిజినెస్‌ సానుకూలత సూచీలో భారత్‌కు ఈసారి 77వ ర్యాంకు లభించింది. గత ఏడాది 100వ ర్యాంకు సాధించిన భారత్‌ ఈసారి మరింత ముందుకు ఎదిగింది. బుధవారం ప్రపంచ బ్యాంకు సూచీ గణాంకాలను వివిధ దేశాల ర్యాంకులను వెల్లడించింది. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఈ ర్యాంకింగ్‌ ఎన్నికల సందర్భంగామరో వరంగా కలిసొచ్చింది. ప్రతిపక్షాలనుంచి వెల్లువలా నిరసన ఎదుర్కొంటున్న తరుణంలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు మోడీ ప్రభుత్వానికి పెద్దప్రచారాస్త్రంగా లభించిందనే చెప్పాలి. ప్రపంచబ్యాంకు విడుదలచేసిన 2019 బిజినెస్‌ నిర్వహణవార్షిక నివేదికలో ప్రపంచ బ్యాంకు పది పారామీటర్లలో ఆరింటిలో అద్వితీయమైన ప్రగతిని సాధించిందని వెల్లడించింది. దేశంలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించేందుకుఅనువైన అన్ని పారామీటర్లు భారత్‌లో సానుకూలంగా ఉన్నాయని అన్నారు. 2014లో మోడీప్రభుత్వం అధికారంలోనికి వచ్చే సమయానికి భారత్‌ బిజినెస్‌ సూచీపరంగా 190 దేశాల్లో 142వ స్థానంలో ఉంది. అంతకుముందు ఏడాది 131వ ర్యాంకునుంచి గత ఏడాది 100వ ర్యాంకుకు ఎదిగింది. న్యూజిలాండ్‌ అన్ని దేశాలకంటే అగ్రస్థానంలోన ఇలిచింది. ఆ తర్వాత సింగపూర్‌, డెన్మార్క్‌, హాంకాంగ్‌ దేశాలు నిలిచాయి. అమెరికా ఎనిమిదోస్థానంలోను, చైనా 46వ స్థానంలోను నిలిచింది. పొరుగుననే ఉన్న పాకిస్తాన్‌ 136వ స్థానంలోనిలిచింది. ప్రపంచ బ్యాంకు భారత్‌ను టాప్‌ పది ఆర్ధికవ్యవస్థలున్న దేశాల్లో ఒకటిగా గుర్తించింది. అంతేకాకుండా గడచిన ఐదేళ్లలో ఆర్ధిక వ్యవస్థ పరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబునిచ్చింది. బిజినెస్‌సూచీలో వృద్దికి భారత్‌ నిర్దేశించిన పది ఉప కేటగిరీల్లో మంచి ప్రగతిని సాధించిందని, గత ఏడాది కూడా ఇదేపనితీరు చూపించిందని ప్రపంచ బ్యాంకు కొనియాడింది. పన్నులరంగపరంగా భారత్‌ 121 ర్యాంకులో నిలిచింది. జిఎస్టఇ అమలు తర్వాత కూడా ఈ ర్యాంకులోనేనిలిచింది. అయితే ప్రపంచ బ్యాంకు అన్ని పరోక్షపన్నులను విలీనంచేసి ఏకీకృత పన్నుగా సంస్కరణలు తీసుకురావడం వల్ల భారత్‌లో పన్నులు చెల్లించేవారి సంఖ్య మరింతపెరుగుతుందని, పన్నులరాబడిసైతం పెరుగుతుందని వెల్లడించింది. అలాగే దివాలా స్మృతిని అమలుచేయడం వల్ల ఈ పరిధిలో పరిష్కారం చేస్తున్న దేశాల ర్యాంకులోభారత్‌ 108కి చేరింది. రుణదాతలు ఈచట్టం ద్వారా 59శాతం క్లెయింలు సాధించినట్లు భారత్‌స్పష్టంచేస్తోంది. ఎక్కువగా నిర్మాణ రంగ అనుమతులు, విదేశీ వాణిజ్యంలలో భారత్‌ప్రగతినిసాధించింది. 66 స్థానాలను అధిగమించి 80వ ర్యాంకుకు వచ్చింది. ఇ-సంచిత్‌ మొబైల్‌యాప్‌ సాయంతో ఇ-పేమెంట్‌ విధానాన్ని కస్టమ్స్‌ డాక్యుమెంట్లకు వీలుకల్పించింది. అలాగే దేశంలో ఎక్కువ సముద్ర ఓడరరేవులను 24 గంటలు పనిచేసే కేంద్రాలుగా మార్చడాన్నిసైతం బిజినెస్‌సూచీ పెరుగుదలకు దోహదంచేసిందని ప్రపంచ బ్యాంకు స్పష్టంచేసింది. ఇక నిర్మాణరంగ అనుమతులుమంజూరుచేయడంలో129 స్థానాలను అధిగమించి 52వ ర్యాంకును సాధించింది. బిజినెన్‌ యూనిట్లనిర్మాణంలోశరవేగంగా అనుమతులు వస్తున్నట్లు వెల్లడించింది. దక్షిణాసియాదేశాల్లో కూడా భారత్‌ టాప్‌గా నిలిచింది. మొత్తం మూడు కేటగిరీల్లో భారత్‌ టాప్‌ 30దేశాల్లో ఒకటిగా నిలిచింది. అవి విద్యుత్‌ సాధించడం, రుణాలుసాధించడం, మైనార్టీ ఇన్వెస్టర్ల పరిరక్షణ కేటగిరీల్లో భారత్‌మరింత ముందంజలో ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఇక మెట్రోపాలిటన్‌ ఏరియాల్లో భారత్‌ 11 అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉందని ప్రపంచ బ్యాంకు గుర్తించింది.