బిగ్ బాస్ 4 హోస్ట్ .. కింగ్ ని రీప్లేస్ చేసేది ఎవరు?

‘వైల్డ్ డాగ్’ చిత్రీకరణ కోసం’కింగ్’ మనాలి వెళ్లారని తెలుస్తోంది…

Nagarjuna -Samantha
Nagarjuna -Samantha

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 దిగ్విజయంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. టీఆర్పీల విషయంలో స్టార్ మా సంతోషంగానే ఉందిట.

ఇక ఈ సీజన్ కి హోస్టింగ్ చేస్తున్న నాగార్జున షో విజయం లో కీలక భూమిక పోషిస్తున్నారు. సీజన్ 3 తరహాలోనే విజయవంతంగా రన్ చేసేందుకు ఆయన చేయాల్సినదంతా చేస్తున్నారు.

షో ఆద్యంతం ఇంటి సభ్యులకు బాసటగా నిలుస్తూ నాగార్జున నడిపిస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే ఇలాంటి కీలక సమయంలో నాగార్జున మిస్సింగ్ అంటూ ప్రచారం సాగుతోంది. ఆయన ఈ వీకెండ్ ఎపిసోడ్ కి ఉండరట.

ఈ వారం మాత్రం నాగార్జునను మిస్సవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన పొరుగు రాష్ట్రాల్లో షూటింగుల్లో ఉన్నారు. వైల్డ్ డాగ్ చిత్రీకరణ కోసం మనాలి వెళ్లారని తెలుస్తోంది.

అక్కడి నుంచి రావడం కుదరకపోవడంతో మరో కొత్త హోస్ట్ ని పరిచయం చేయబోతున్నారని ప్రచారమవుతోంది.

ఇంతకీ ఎవరా హోస్ట్ ? అంటే.. నాగార్జున కోడలు సమంతనే అంటూ గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అది సెన్సేషనే.

సామ్ బుల్లితెర ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి అభిమానులకు ఉంది. ఇక తమిళమ్మాయే అయినా సమంత తెలుగు అద్భుతంగా మాట్లాడేస్తుంది.

జెస్సీ క్యూట్ మాటలు అందరినీ మెప్పిస్తాయనే చెప్పాలి. మరి బిగ్ బాస్ నిర్వాహకులు స్వయంగా ప్రకటించాల్సి ఉంది . 

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/