బిగ్‌సిలో ‘నోకియా-5 ప్రీబుకింగ్స్‌

 

NOKIA
NOKIA

హైదరాబాద్‌: నోకియా ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌ఎండిగ్లోబల్‌ నోకియా-5 ప్రిబుకింగ్స్‌కోసం  బిగ్‌సి మొబైల్స్‌తో భాగస్వామ్యం చేసుకుంది. నోకియా-5 అనేది స్లీక్‌గా ఉండే కాంపాక్ట్‌ ఆండ్రాయిడ్‌స్మార్ట్‌ఫోన్‌ అని 5.2 అంగుళాల డిస్‌ప్లేగా ఉంటుందని, ప్రీమియం క్వాలిటీ డిజైన్‌తో ఆండ్రాయిడ్‌ 7.1.1ఆపరేటింగ్‌ వ్యవస్థతో వస్తున్నట్లు కంపెనీ గ్లోబల్‌ జిఎం టిఎస్‌ శ్రీధర్‌ వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రముఖ రిటైల్‌స్టోర్లలో రూ.12,899లకు నోకియా-5 లభిస్తుందన్నారు. నాలుగురంగుల్లో ఉంటుందని మరికొన్ని వారాల్లో సిల్వర్‌, టెంపర్డ్‌బ్లూ, కాపర్‌రంగుల్లో కూడా వస్తుందని శ్రీధర్‌ వెల్లడించారు. బిగ్‌సిమొబైల్స్‌ ఛైర్మన్‌ ఎం బాలుచౌదరి మాట్లాడుతూ హెచ్‌ఎండిగ్లోబల్‌తో భాగస్వామ్యం గర్వంగా ఉందన్నారు.  నోకియా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లపై ఎంతో ఆసక్తి ఉందని, నోకియా-5ను కస్టమర్లు ఎంతో  స్వాగతిస్తారని అన్నారు. ప్రీమియం డిజైన్‌, ప్యూర్‌ ఆండ్రాయిడ్‌ వాగ్దానంలతో దీనిపట్ల ఎంతో ఉత్సాహం నెలకొందన్నారు. 13ఎంపి ఫేస్‌ డిటెక్షన్‌ ఆటోఫోకస్‌ కెమేరా ఉందని, డ్యూయల్‌టోన్‌ప్ల్‌ా అన్నిరకాల వెలుతురుకు తగినట్లు పనిచేస్తుందని శ్రీధర్‌ వెల్లడించారు.ముందు కెమేరా 8ఎంపి సామర్ధ్యంతో ఉంటుంది. వొడాఫోన్‌ కస్టమర్లు నోకియా5పై3నెలల
పాటు 5జిబిడేటాను రూ.149కే పొందుతారు. కస్టమర్లు రూ.2500 తగ్గింపు ఓచర్లు కూడా పొందుతారని, మేక్‌మైట్రిప్‌ డాట్‌కామ్‌నుంచి పొందుతారన్నారు. రెండుసిమ్‌లతో ఆడ్రాయిడ్‌ నౌగట్‌తో, క్వాల్‌కామ్‌స్నాప్‌డ్రాగన్‌430 మొబైల్‌ ఫ్లాట్‌ఫామ్‌,3000 ఎంఎహెచ్‌ బ్యాటరీతో శక్తివంతమైన పనితీరు చూపుతుందని హెచ్‌ఎండిగ్లోబల్‌ జిఎం వెల్లడించారు.