బిగ్‌బజార్‌లో నవరాత్రి ఫ్యాషన్‌షో

BUS1
Navratri Fashion Show at Big Bazar

బిగ్‌బజార్‌లో నవరాత్రి ఫ్యాషన్‌షో

హైదరాబాద్‌, సెప్టెంబరు 30: ఫ్యూచర్‌ గ్రూప్‌సంస్థ బిగ్‌బజార్‌ దసరా పండుగకోసం కొత్తగా నవరాత్రి కలెక్షన్‌ ప్రారంభించింది. కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకుగాను బిగ ్‌బాజార్‌ ప్రముఖ టాలివుడ్‌ నటి తాప్సిపన్ను ఇతరమోడల్స్‌ సాయంతో ప్రత్యేక ఫ్యాషన్‌ షోను నిర్వహించింది. తొమ్మిదిరోజుల పండుగ దినాల్లో ధరించేందుకువీలుగా తొమ్మిది విభిన్న డిజైనర్‌ దుస్తులనుప్రదర్శించారు. అంతేకా కుండా నవరాత్రి కలెక్షన్‌ను తాప్సి లాంఛనంగా విడుదలచేసింది. అమీర్‌పేట్‌ బిగ్‌బాజార్‌లో ఈ కొత్త కలెక్షన్‌ను ప్రారంభించారు. మహిళలు, పురుషులు,యువతీయువకులు, చిన్నపిల్లలకు అనువైన డిజైన్లను వందలాదిగా విడుదల చేసామని ఫ్యూచర్‌గ్రూప్‌ బిగ్‌బాజార్‌ ప్రకటిం చింది. బిగ్‌బాజార్‌ సిఇఒ సదాశివ్‌నాయక్‌ మాట్లాడుతూ పండుగల వేడుకలు నిర్వహించడం ద్వారా మంచి మార్పులు వస్తాయని బిగ్‌బజార్‌ విశ్వసిస్తుందని, తొమ్మిది రంగులతో కలర్స్‌ఆఫ్‌ దసరా పేరిట దుస్తుల కొనుగోలుదారులకోసం కొత్త ఫ్యాషన్‌షోనిర్వహించామన్నారు. కలర్స్‌ఆఫ్‌ దసరా పేరిట ఉన్న ఈ సాంప్రదాయక ఫ్యాషన్‌ దుస్తులు అత్యధికంగా అమ్ముడవుతాయన్న అంచనాలున్నాయి.