బిఎస్‌ఇలో ప్రభుత్వరంగ సంస్థలసూచి గలగల!

BSEFFF
bse

బిఎస్‌ఇలో ప్రభుత్వరంగ సంస్థల సూచి గలగల!

 

ముంబై, అక్టోబరు 24: ఆసియాలోనే మొట్టమొదటిసంస్థగా ఉన్న బాంబేస్టాక్‌ ఎక్ఛేంజిలో ప్రభుత్వరంగ సంస్థల సూచీ 52 వారాల గరిష్టస్థాయిని నమోదుచేసింది. బిఎస్‌ఇ పిఎస్‌యు సూచీలో భారీ కంపెనీలు బహుళ సంవత్సరాల గరిష్టస్థాయిని సోమవారం నమోదుచేవాయి. ఒఎన్‌జిసి, ఇంజనీర్స్‌ ఇండియా, గుజరాత్‌ ఖనిజవనుల అభివృద్ధి సంస్థ, గెయిల్‌ ఇండియా, మోయిల్‌, పవర్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ వంటివి 52వారాల గరిష్టస్థాయిని తాకాయి. మధ్యాహ్నం తర్వాత పిఎస్‌ యు సూచి 1.7శాతానికి పెరిగి 7953 పాయింట్లకు చేరింది. బిఎస్‌ఇసెన్సెక్స్‌ 0.45శాతం పెరిగితే పిఎస్‌యు సూచి ఒక్కటే 1.7శాతం పెరిగింది ఇంట్రాడేలో 7963 పాయింట్లకు చేరింది. 2015 ఏప్రిల్‌ తర్వాత ఇదే గరిష్టస్థాయిగా నమోదయింది. గడచిన నెలరోజులుగా పిఎస్‌ యు సూచి మార్కెట్లలో భారీ లాభాలతో కొన సాగింది. 0.4శాతం క్షీణతనుంచి కోలుకు ఐదు శాతానికి పెరిగింది. ఒఎన్‌జిసి ఐదుశాతంపెరిగి 294వద్ద నిలిచింది. బోర్డు సమావేశం ఈనెల 27వ తేదీ నిర్వహిస్తారు. బోనస్‌షేర్ల జారీపై చర్చిస్తారు. మోయిల్‌పరంగా ఐదుశాతంపెరిగి 310కి చేరింది. మైనింగ్‌ కంపెనీ షేర్లు 25 శాతంర్యాలీతీసాయి. కంపెనీఇటీవలే 76,409 హెకా్ల భూమిని బాలాఘాట్‌లో తవ్వేందుకు ప్రభుత్వ అనుమతులు సాధించింది. హెచ్‌డి ఎఫ్‌సి సెక్యూరిటీస్‌పరంగాచూస్తే కంపెనీ ఉత్పత్తి పరిమాణాలను పెంచింది. మాంగనీస్‌ కంపెనీలు కూడా పెరిగాయి. మోయిల్‌ కంపెనీపరంగా ప్రస్తుత మార్కెట్‌ధర 273-280వద్ద నిలి చింది. ఇంజినీర్స్‌ ఇండియా 276 నుంచి 278 రూపాయలు, జిఎండిసి 107.90 రూపాయలనుంచి 109 రూపాయలు, గెయిల్‌ఇండియా 443.50 నుంచి 450.45రూపాయలు, మోయిల్‌ 303.95 నుంచి 309.80 రూపాయలు, పవర్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ 127 నుంచి 130.45 రూపాయలు, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ 137.65 నుంచి 140.95 రూపాయలకు పెరిగినట్లు అంచనా.