బిఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్స్‌

BSF
BSF

న్యూఢిల్లీలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ – మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్క్‌షాప్‌ కోసం టెక్నికల్‌ సిబ్బంది (గ్రూప్‌ సీ కంబాటైజ్డ్‌) (కానిస్టేబుల్స్‌) నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
జనరల్‌ అభ్యర్థులకు 143, ఎస్సీలకు 32, ఎస్టీలకు 24, ఓబీసీలకు 8 ఖాళీలను కేటాయించారు.
విభాగాలవారీ ఖాళీలు: వెహికిల్‌ మెకానిక్‌ 50, ఆటో ఎలక్ట్రీషియన్‌ 17, వెల్డర్‌ 19, అప్‌హోల్‌స్టర్‌ 22, టర్నర్‌ 14, కార్పెంటర్‌ 20, స్టోర్‌ కీపర్‌ 14, పెయింటర్‌ 18, వల్కనైజ్‌ / ఆపరేటర్‌ టైర్‌ రిపేర్‌ ప్లాంట్‌ 7, ఫిట్టర్‌ 11, బ్లాక్‌ స్మిత్‌ / టిన్‌ స్మిత్‌ 15
అర్హత: పదోతరగతి / మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 22
వెబ్‌సైట్‌: www.bsf.nic.in