బిఎండబ్ల్యు 5సిరీస్‌కు బుకింగ్స్‌

BMW11
BMW

బిఎండబ్ల్యు 5సిరీస్‌కు బుకింగ్స్‌

ముంబై, మే 13: బిఎండబ్ల్యు 5సిరీస్‌ కొత్త వాహ నాలు మార్కెట్‌కు వస్తున్నాయి. 29జూన్‌లో ప్రారంభించనున్న ఈ కొత్త సిరీస్‌ వాహనాలకు బుకింగ్స్‌ కూడా ప్రారంభించింది. అడ్వాన్సు బుకిం గ్స్‌ కోసం ముందుగా రూ.2లక్షలు నుంచి 3లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. 7సిరీస్‌ స్ఫూర్తితో బిఎండబ్ల్యు 5సీరిస్‌ను విడుదలచేస్తోంది. తేలిక పాటి గాను, పెద్ద వాహనంగా ఉంటుందని అంచనా. 2017-5సిరీస్‌ రెండు డీజిల్‌, ఒక పెట్రోల్‌ ఇంజన్‌ వెర్షన్లలో ఉన్నాయి. 2.0 లీటర్‌ నాలుగు సిలిండర్ల ఇంజన్‌190 హెచ్‌పి శక్తిని ఇస్తుంది. ఇక 3.0లీటర్‌ ఆరు సిలిండర్‌ టర్బోఛార్జి యూనిట్‌ను 265హెచ్‌పి శక్తిని అందిస్తుంది. ఎనిమిది స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రామాణికంగా ఉంటుంది. పెట్రోలు వెర్షన్‌లో 2.0 లీటర్‌ యూనిట్‌ ఇంజన్‌ 252 ఆశ్విక శక్తితో పని చేస్తుంది. 5సిరీస్‌ వాహనాలు సుమారు రూ.52 లక్షల నుంచి 65 లక్షల ఎక్స్‌షోరూం ధరలుగా ఉంటాయని నిపుణులు చెపుతున్నారు. ఈ సిరీస్‌ కొత్త వాహనాలు మెర్సిడిస్‌బెంజ్‌ ఇక్లాస్‌, ఆడిఎ6, జాగ్వార్‌ ఎక్స్‌ఎఫ్‌, వోల్వోఎస్‌90 వెర్షన్లకు గట్టి పోటీనిస్తుందని ఆటోరంగ నిపుణుల అంచనా