బాహుబలి దిగ్రేట్‌..

Prabhas Baahubali 2
యంగ్‌రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఇక ఆ సినిమాతో అంత బిజీగా ఉండి కూడ ప్రభాస్‌ తన సమయాన్ని వెచ్చింది తమ ఇంట్లో పనిచేసే నొకరు పెళ్లికి ప్రత్యేకంగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.. ప్రభాస్‌ ఇంట్లో పనిచేసే పని మనిషి పెళ్లి హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరిగింది.. ఈ వేడుకకు ప్రభాస్‌ తన బిజీ షెడ్యూల్‌ని సైతం అడ్జస్ట్‌ చేసకుని హాజరయ్యారు. ఇక ప్రభాస్‌ రాకతో పెళ్లి వేడుకకు మరింత కళ వచ్చింది. తన సమయాన్ని కుదుర్చుకుని ప్రభాస్‌ తమ పెళ్లికి హాజరవ్వటం పట్ల నూతన దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ప్రభాస్‌ సినిమా బాహుబలి2 విషయాని కొస్తే.. దేశం మొత్తాన్నీ ఒక ఊపుఊపిన ఈ సినిమా 2వ భాగం కావటంతో సినిమాపై ఉండే అంచనాలను అందుకునేలా భారీ ఎత్తున సినిమాను నిర్మిస్తున్నారు.