బాసర ట్రిపుల్‌ ఐటీ సీట్లు పెంపు

Telangana
Telangana

హైదరాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటిలో సీట్ల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఉన్న 1000సీట్లకు అదనంగా మరో 500సీట్లను ప్రభుత్వం పెంపుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరిగిన సీట్లతో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 1500కి పెరిగింది. పెరిగిన సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.