బాల సాహిత్య పురస్కార గ్రహీత వేదాంతసూరి

t. vedantasuri
t. vedantasuri

పార్వతిపురం: పార్వతిపురానికి చెందిన నారంశెట్టి బాల సాహిత్య పీఠం 2018 సంవత్సరానికి ప్రధానం చేసే బాల సాహిత్య పురస్కారాలను ఫిబ్రవరి 3న విశాఖలో అందజేశారు. విజేతలుగా శ్రీవాణి పలుకు సంపాదకులు ఎం.వి.వి. సత్యనారాయణ, మొలక పిల్లల పత్రిక సంపాదకులు తిరునగరి. వేదాంతసూరిని ఆ పీఠం వ్యవస్థాపకులు ,బాల సాహిత్యవేత్త నారంశెట్టి ఉమామహేశ్వరరావు దంపతులు ఎంపిక చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, బాల సాహిత్య ప్రేమికులు, విద్యార్థులు హాజరయ్యారు.