బాల గేయం

balageyam
balageyam


నవ్విన పల్లెలు
ముసిరినవి మబ్బులు
వీచినవి గాలులు
ఉరిమినవి ఉరుములు
మెరిసినవి మెరుపులు
కురిసినవి వానలు
తడిసినవి నేలలు
కొండలు కోనలు
వాగులు వంకలు
ఉబికినవి జలములు
పారినవి పాయలు
నిండినవి చెరువ్ఞలు
మురిసిరి రైతులు
దున్నిరి దుక్కులు
వేసిరి విత్తులు
పచ్చని పైరులు
పండినవి పంటలు
నిండినవి గాదెలు
నవ్వినవి పల్లెలు
కలిసిరి బంధువ్ఞలు
చేసిరి విందులు

  • అన్నల్‌దాస్‌ రాములు, సిద్ధిపేట

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/