బాల‌య్య రోడ్‌షో సూప‌ర్ స‌క్సెస్ః సోమిరెడ్డి

AP Minister Somireddy
AP Minister Somireddy

నంద్యాలః ఉప ఎన్నిక‌ల్లో భాగంగా ఈ రోజు త‌మ పార్టీ ఎమ్మెల్యే, సినీన‌టుడు బాలకృష్ణ నిర్వ‌హించిన‌ రోడ్ షో
సూపర్ సక్సెస్ అయ్యిందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు. ఈ నెల 19న సీఎం చంద్ర‌బాబు
నాయుడు కూడా రోడ్ షో నిర్వ‌హిస్తార‌ని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నిక‌ల నేప‌థ్యంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌ అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 2014లో కర్నూలులో
జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీల‌ పనులు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు.